ఆసుపత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జి... స్వగ్రామానికి పయనం
- ఎన్నారై ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందిన అచ్చెన్న
- తాజా పరీక్షలో కరోనా నెగెటివ్
- మూడ్రోజుల క్రితం ఈఎస్ఐ స్కాంలో బెయిల్ మంజూరు
ఈఎస్ఐ కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందంటూ అచ్చెన్నను ఏసీబీ కొన్నినెలల కిందట అరెస్ట్ చేసింది. అయితే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నందున గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ, ఆపై రమేశ్ ఆసుపత్రిలోనూ చికిత్స అందించారు. కరోనా సోకడంతో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. కరోనా నయం కావడంతో ఆయన తన స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.