Bigg Boss Telugu 4: తెలుగు బిగ్ బాస్ లో కరోనా కలకలం

3 Big Boss Telugu contestants tests with corona positive
  • త్వరలోనే ప్రారంభం కానున్న బిగ్ బాస్ 4
  • ముగ్గురు కంటెస్టెంట్ లకు కరోనా పాజిటివ్
  • ఎక్స్ ట్రా కంటెస్టెంట్ లతో వీరిని రీప్లేస్ చేయనున్న వైనం
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో నాలుగో సీజన్ త్వలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. మరోవైపు ఈ సీజన్ లో పాల్గొనే 16 మంది కంటెస్టెంట్ లను ఇప్పటికే ఎంపిక చేశారు. అయితే, వీరిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. వీరిలో యూట్యూబర్ గంగవ్వతో పాటు ఒక సింగర్ కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో బిగ్ బాస్ టీమ్ ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. ఇంకోవైపు ముందుగానే ఎంపిక చేసిన ఎక్స్ ట్రా కంటెస్టెంట్ లతో వీరు ముగ్గురినీ రీప్లేస్ చేయనున్నట్టు తెలుస్తోంది.
Bigg Boss Telugu 4
Corona Virus

More Telugu News