Virat Kohli: కోహ్లీ సరసన నిలిచిన పాక్ క్రికెటర్ బాబర్ అజామ్!

Pak Cricketer Babar Azam Equals Kohli Record
  • టీ-20ల్లో 1,500 పరుగులు
  • ఇంగ్లండ్ రెండో టీ-20లో రికార్డు
  • గతంలో ఈ ఫీట్ సాధించిన కోహ్లీ, ఫించ్
పాకిస్థాన్ క్రికెట్ కెప్టెన్ బాబర్ అజామ్ అరుదైన రికార్డును సాధించి, విరాట్ కోహ్లీ, ఆరోన్ ఫించ్ ల సరసన నిలిచాడు. ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీ-20లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ (56)తో చెలరేగిపోయిన బాబర్, అంతర్జాతీయ టీ-20 క్రికెట్ లో 1,500 పరుగులు సాధించిన ఆటగాళ్లలో చేరిపోయాడు.

అంతకుముందు ఈ ఫీట్ ను సాధించింది విరాట్ కోహ్లీ, ఫించ్ లు మాత్రమే. పొట్టి క్రికెట్ లో 1,500 పరుగులు సాధించడానికి అజామ్ కు 39 ఇన్నింగ్స్ లు అవసరం అయ్యాయి. తాజా హాఫ్ సెంచరీ అజామ్ కు 14వది కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 196 పరుగులు చేయగా, 197 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ మోర్గాన్ 66, మలాన్ 54 పరుగులు సాధించడంతో సులువుగానే విజయం సాధించింది.
Virat Kohli
Ababr Azam
Aron finch

More Telugu News