Support Movie Theaters: 'సపోర్ట్ మూవీ థియేటర్స్'... దేశవ్యాప్తంగా మొదలైన ఉద్యమం!

Industry people starts Support Movie Theaters movement
  • కరోనా ప్రభావంతో మూతపడిన సినిమా హాళ్లు
  • థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతించని కేంద్రం
  • సేవ్ సినిమా అంటూ గళం విప్పిన సినీ ప్రముఖులు
భారత్ లో గత ఐదు నెలలుగా కరోనా ప్రభావం ఉద్ధృతంగా కొనసాగుతోంది. దాంతో లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమాహాళ్లు మూతపడ్డాయి. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ వంటి ప్రధాన చిత్ర పరిశ్రమల కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. అయితే, కేంద్రం కొన్నిరోజులుగా అన్ లాక్ ప్రక్రియను దశల వారీగా అమలు చేస్తోంది. కానీ సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు మాత్రం అనుమతించడంలేదు. ఇలాగైతే సినీ రంగం కోలుకోలేని దెబ్బతింటుందని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో మొదలైందే 'సపోర్ట్ మూవీ థియేటర్స్' ఉద్యమం ఆన్ లైన్ లో మొదలైన ఈ ఉద్యమం కొద్దిసేపట్లోనే అన్ని పరిశ్రమల చిత్ర ప్రముఖులను కదిలించింది. ప్రతి ఒక్కరూ 'సపోర్ట్ మూవీ థియేటర్స్' ఉద్యమంలో భాగం 'సేవ్ సినిమా' అంటూ నినదిస్తున్నారు. బోనీ కపూర్, శోభు యార్లగడ్డ వంటి ప్రముఖ నిర్మాతలు, నటులు మంచు విష్ణు, ఐశ్వర్య రాజేశ్ తదితరులు కూడా సేవ్ సినిమా అంటూ తమ గళం వినిపిస్తున్నారు.
Support Movie Theaters
Save Cinema
Corona Virus
Lockdown
Unlock
India

More Telugu News