Mekathoti Sucharitha: వైజాగ్ శిరోముండనం వ్యవహారంలో 24 గంటల్లో కేసు నమోదు చేశాం: మేకతోటి సుచరిత

AP Home Minister Mekathoti Sucharitha responds on Vizag tonsure case
  • శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం
  • నూతన్ నాయుడు ఇంట్లో ఘటన
  • పోలీసులను అభినందించిన హోంమంత్రి
వైజాగ్ లో శ్రీకాంత్ అనే దళిత యువకుడికి బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో శిరోముండనం జరగడం తెలిసిందే. దీనిపై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు.

వైజాగ్ లో దళిత యువకుడికి శిరోముండనం కేసులో కేవలం 24 గంటల లోపు నిందితులపై కేసు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ అంశంలో వైజాగ్ నగర పోలీసుల పనితీరు అభినందనీయం అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా దళితులపై అఘాయిత్యాలు, హింసకు పాల్పడితే సహించేది లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. తప్పు చేసిన వాళ్లు ఎవరైనా సరే శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు.
Mekathoti Sucharitha
Tonsure
Vizag
Police
Nutan Naidu
Andhra Pradesh

More Telugu News