Narendra Modi: మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని.. సెప్టెంబరు 14 నుంచి 20 వరకు ‘సేవా సప్తాహ్’

BJP to observe Seva Saptah to mark PM Modis 70th birthday on September 17
  • వచ్చే నెల 17న మోదీ 70వ పుట్టిన రోజు
  • ‘70’ పేరుతో ప్రతి మండలంలోనూ సేవా కార్యక్రమాలు
  • ఎప్పుడు ఏం చేయాలో పేర్కొంటూ రాష్ట్ర శాఖలకు సర్క్యులర్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే నెల 17న 70వ పుట్టిన రోజు జరుపుకోనున్న నేపథ్యంలో ఆ నెల 14 నుంచి 20 వరకు ‘సేవా సప్తాహ్’ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏ రోజు ఏ కార్యక్రమాలు నిర్వహించేదీ తెలియజేస్తూ ఓ సర్క్యులర్‌ను అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు పంపించింది. ‘70’ పేరుతో చేపట్టనున్న ఈ కార్యక్రమాల వివరాలను అందులో పొందుపరిచింది. సేవా సప్తాహ్‌లో భాగంగా ప్రతి మండలంలోనూ 70 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఇతర పరికరాలను పంపిణీ చేస్తారు. అలాగే, 70 మంది అంధులకు కళ్లజోళ్లు, 70 ఆసుపత్రులు, పేదల కాలనీల్లో పండ్లు పంపిణీ చేస్తారు. 70 మంది కొవిడ్ రోగులకు ప్లాస్మా దానానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తారు.
Narendra Modi
Birth day
seve saptah
BJP

More Telugu News