హీరోయిన్ తో నా అఫైర్ బయటకు ఎలా?... తేల్చాలని ప్రత్యేక టీమ్ ను పెట్టిన దావూద్ ఇబ్రహీం!
- మెహవిష్ తో దావూద్ కు సాన్నిహిత్యం
- అఫైర్ పై వార్తలతో అసంతృప్తి
- ఎలా తెలిసిందో విచారించాలని టీమ్ ఏర్పాటు
1983, జనవరి 6న జన్మించిన మెహవిష్ హయత్, లోడ్ వెడ్డింగ్, పంజాబ్ నహీ జానుగీ, యాక్టర్ ఇన్ లా తదితర చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం 37 ఏళ్ల వయసులో ఉన్న మెహవిష్, గత కొన్నేళ్ల వరకూ ఎవరికీ తెలియదు. దావూద్ పరిచయం, ఆయన సిఫార్సుతో పాక్ సినీ పరిశ్రమలో అత్యుత్తమ అవార్డును పొందిన తరువాత, మెహవిష్ పేరు ఆ దేశంలో మారుమోగిపోయింది. అవార్డు పొందిన నెలల వ్యవధిలోనే పాక్ గ్లామర్ ప్రపంచంలో మెహవిష్ ప్రముఖురాలైందన్న సంగతి తెలిసిందే.