Renu Nagar: బాయ్‌ఫ్రెండ్ మృతి విషయం తెలిసి.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సింగర్ రేణు

Indian Idol 10s Renu Nagar admitted to hospital in critical condition after boyfriend dies by suicide
  • తబలా పాఠాలు నేర్చుకునేందుకు వచ్చి ప్రేమలో పడిన రవి
  • రవికి ఇప్పటికే ఇద్దరు పిల్లలు
  • ఈ ఏడాది జూన్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయిన రేణు, రవి
తన బాయ్‌ఫ్రెండ్ మృతి చెందిన విషయం తెలిసిన ఓ సింగర్ ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతోంది. జైపూర్‌లో జరిగిందీ ఘటన. ఇండియన్ ఐడల్ సీజన్ 10 ఫేమ్, గాయకురాలైన రేణు నాగర్ ఇంటికి తబలా పాఠాలు నేర్చుకునేందుకు రవిశంకర్ (27) వచ్చేవాడు. ఈ క్రమంలో వారిమధ్య ప్రేమ చిగురించింది. రవికి ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఈ ఏడాది జూన్‌లో ఇద్దరూ కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో రేణు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తెను మాయమాటలతో నమ్మించి రవి తీసుకెళ్లిపోయాడని ఆరోపించారు. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం రేణు, రవి ఇంటికి తిరిగొచ్చారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందో కానీ గురువారం రాత్రి భరత్‌పూర్‌లో రవి విషం తీసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడిని అల్వార్‌లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

రవి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిన సింగర్ రేణు షాక్‌తో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు వెంటనే ఆమెను అల్వార్‌లోని మిట్టల్ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే రవి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Renu Nagar
boyfriend
suicide
Indian Idol 10

More Telugu News