Dalit Woman: దళిత ఉద్యోగినిపై దాడికి యత్నించిన వైసీపీ నేత.. కేసు నమోదు  

YSRCP leader tried to attack dalit woman in Kurnool district
  • కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో ఘటన
  • కాంట్రాక్టు ఉద్యోగినిపై దాడికి యత్నించిన ప్రభాకర్ రెడ్డి
  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు
కర్నూలు జిల్లా వెలుగోడు మండలంలో ఓ దళిత మహిళపై వైసీపీ నేత ఒకరు దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. మండలంలోని రేగడ గూడూరులో కాంట్రాక్టు ఉద్యోగినిగా పని చేస్తున్న దళిత మహిళ రంగమ్మపై స్థానిక వైసీపీ నేత ప్రభాకర్ రెడ్డి దాడికి యత్నించాడు. కులం పేరుతో అసభ్యంగా దూషించాడు. ఆమెపై దాడి చేయబోగా... స్థానికులు అడ్డుకున్నారు.

 ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డిపై పోలీస్ స్టేషన్ లో రంగమ్మ ఫిర్యాదు చేశారు. దీంతో, అతనిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మరోవైపు రంగమ్మ మాట్లాడుతూ, ఇంతవరకు ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడి చేస్తే సహించబోనని ముఖ్యమంత్రి చెపుతున్నా... దాడులు ఆగటం లేదని వాపోయారు.
Dalit Woman
Kurnool District
Velugodu
Attack
YSRCP

More Telugu News