Bonda Uma: ప్రచారం కోసం పక్కవాడి బిడ్డను కూడా మా బిడ్డే అంటున్నారు: బోండా ఉమ

YSRCP leaders have no right to walk on Durga flyover says Bonda Uma
  • ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దుర్గ గుడి ఫ్లైఓవర్ ను వైసీపీ అడ్డుకుంది
  • వైసీపీ పాలన మొత్తం అవినీతితో నిండిపోయింది
  • కరోనా పేరుతో కమిషన్లను కూడా వసూలు చేస్తున్నారు
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయవాడలోని దుర్గ గుడి ఫ్లైఓవర్ ను అడ్డుకుందని... ఇప్పుడు తామే నిర్మించామంటూ గొప్పలు చెప్పుకుంటోందని టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు. ఫ్లైఓవర్ పై నడిచే అర్హత కూడా వైసీపీ నేతలకు లేదని అన్నారు. అధికార పార్టీకి ప్రచార ఆర్భాటం ఎక్కువైందని... ప్రచారం కోసం ఇతరుల బిడ్డను కూడా తమ బిడ్డే అంటోందని విమర్శించారు. రూ. 60 వేల కోట్లతో అన్ని జిల్లాల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. విజయవాడలో రూ. 500 కోట్లతో డ్రైనేజీ పనులు చేపట్టిన ఘనత టీడీపీదే అని అన్నారు.

వైసీపీ పాలన మొత్తం అవినీతితో నిండిపోయిందని ఉమ ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాపారులను దోచుకుంటున్నారని చెప్పారు. చివరకు కరోనా పేరుతో కమిషన్లను కూడా వసూలు చేస్తున్నారని అన్నారు. ఉద్యోగ నియామకాలను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. గుట్కా, పేకాట దందాలు ఎక్కువైపోయాయని అన్నారు. కృష్ణా జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనా? అంటూ వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.
Bonda Uma
Telugudesam
YSRCP
Durga Gudi Flyover

More Telugu News