Andhra Pradesh: ఏపీలో కొత్తగా మరో 10,548 మందికి కరోనా.. తాజా అప్డేట్స్!

Andhra Pradesh witnesses 82 Corona deaths in as single day
  • 24 గంటల్లో 82 మంది మృతి
  • 4,14,164కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
  • తూర్పుగోదావరి జిల్లాలో 1,096 కేసులు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ప్రభంజనం కొనసాగుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 10,548 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మొత్తం 62,024 మందికి టెస్టులు నిర్వహించారు. మరోవైపు కరోనా కేసుల్లో తూర్పుగోదావరి జిల్లా ముందు వరుసలో ఉంది. తాజాగా ఆ జిల్లాలో కొత్తగా 1,096 కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో నెల్లూరు జిల్లా 1038, కడప జిల్లా 991, విశాఖ జిల్లా 988 ఉన్నాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,14,164కి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 97,681 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరోవైపు, గత 24 గంటల్లో 82 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,796కి చేరుకుంది.
Andhra Pradesh
Corona Virus
Cases

More Telugu News