Nagarjuna: కూర్గ్ నుంచి నువ్వు కాఫీ పంపిస్తున్నందుకు థాంక్యూ రష్మిక: నాగార్జున

Nagarjuna replies to Rashmika Mandanna wishes
  • ఇవాళ నాగార్జున పుట్టినరోజు
  • హ్యాపీయెస్ట్ బర్త్ డే అంటూ రష్మిక ట్వీట్
  • కృతజ్ఞతలు తెలిపిన నాగ్
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ఇవాళ 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా క్యూట్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా నాగ్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. హ్యాపీయెస్ట్ బర్త్ డే అంటూ రష్మిక ట్వీట్ చేసింది. దీనికి నాగ్ వెంటనే బదులిచ్చారు. థాంక్యూ ప్రియమైన రష్మిక అంటూ స్పందించారు. అంతేకాదు, కూర్గ్ నుంచి నువ్వు కాఫీ పంపిస్తున్నందుకు కూడా కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేశారు. అటు, మహేశ్ బాబు, వెంకటేశ్, రకుల్ ప్రీత్, పూరీ జగన్నాథ్ తదితరులు నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Nagarjuna
Rashmika Mandanna
Birthday
Coffee
Coorg
Tollywood

More Telugu News