V Hanumantha Rao: అప్పుడు సీఎం రేసులో ఉన్న నన్ను నీవు దెబ్బకొట్టిన మాట నిజం కాదా?: ఆజాద్ పై విరుచుకుపడ్డ వీహెచ్

VH fires on Gulam Nabi Azad
  • ఆజాద్ లేఖపై మండిపడ్డ వీహెచ్
  • కాంగ్రెస్ వల్ల ఎన్నో పదవులు అనుభవించావని వ్యాఖ్య
  • ఇందిర లేకపోతే ఎక్కడ నుంచి వచ్చేవాడివని ప్రశ్న
కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పై తెలంగాణ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. సొంత పార్టీని ఉద్దేశించి ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇందిరాగాంధీ లేకపోతే నీవు ఎలా వచ్చేవాడివని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ దయ వల్ల గత 40 ఏళ్లుగా ఏదో ఒక పదవిలో ఉంటున్నావని అన్నారు. ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కాంగ్రెస్ నీకు అండగా ఉందని చెప్పారు.

రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా ఉన్న నీవు... పార్టీ హైకమాండ్ కు లేఖ ఎలా రాస్తావని వీహెచ్ మండిపడ్డారు. ఇందిరమ్మ, సోనియమ్మ వల్లే నీకు పదవులు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ వల్ల ఎంతో అనుభవించిన ఆజాద్... పార్టీ కష్టంలో ఉన్న ఈ సమయంలో మాట్లాడుతున్న తీరు దారుణంగా ఉందని దుయ్యబట్టారు. '1992లో జనార్దన్ రెడ్డి తర్వాత సీఎం రేసులో ఉన్న నన్ను నీవు దెబ్బకొట్టిన విషయం నిజం కాదా?' అని ప్రశ్నించారు.
V Hanumantha Rao
Gulam Nabi Azad
Congress
Sonia Gandhi

More Telugu News