Black Panther: హాలీవుడ్ ప్రముఖ నటుడు, బ్లాక్ పాంథర్ హీరో చాడ్విక్ కన్నుమూత

Black Panther Star Chadwick Boseman Dies Of Cancer
  • నాలుగేళ్లుగా పెద్దపేగు కేన్సర్‌తో బాధపడుతున్న చాడ్విక్
  • ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్లు వసూలు చేసిన బ్లాక్ పాంథర్
  • ‘డా 5 బడ్స్‌’లో చివరిసారి కనిపించిన నటుడు
నాలుగేళ్లుగా పెద్దపేగు కేన్సర్‌తో పోరాడుతున్న హాలీవుడ్ స్టార్ నటుడు చాడ్విక్ బోస్‌మాన్ కన్నుమూశాడు. ఆయన వయసు 43 సంవత్సరాలు. చాడ్విన్ ఇంట్లోనే మరణించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. చాడ్విక్ 2016 నుంచి స్టేజ్ 3 పేగు కేన్సర్‌తో బాధపడుతున్నాడు.

2016లో వచ్చిన ‘కెప్టెన్ అమెరికా సివిల్‌వార్’ సినిమాలో మార్వెల్ సూపర్ హీరో బ్లాక్ పాంథ‌ర్ పాత్ర‌ను పోషించిన చాడ్విక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాడు. ఇదే పాత్ర‌ను ‘ఎవెంజ‌ర్స్ ది ఎండ్‌గేమ్‌’లోనూ పోషించాడు. 2018లో వచ్చిన బ్లాక్ పాంథర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ల డాలర్లకు పైగా వసూలు చేసింది 2016 నుంచి కేన్సర్‌కు చికిత్స పొందుతూనే పలు సినిమాల్లో చాడ్విక్ నటించాడు. ఈ ఏడాది ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన డా 5 బ్లడ్స్‌లో చాడ్విక్‌ చివరిసారిగా కనిపించాడు.
Black Panther
Hollywood
Chadwick Boseman
Cancer
Died

More Telugu News