SBI: ఎస్‌బీఐ తదుపరి చైర్మన్‌గా దినేశ్ కుమార్.. ప్రతిపాదించిన బీబీబీ

Banks Board Bureau Recommends Dinesh Kumar Khara As Next SBI Chairman
  • అక్టోబరు 7తో ముగియనున్న  ప్రస్తుత చైర్మన్ రజనీశ్ పదవీకాలం
  • చల్లా శ్రీనివాసులను రిజర్వు క్యాండిడేట్‌గా ప్రతిపాదన
  • పనితీరు, అనుభవం ఆధారంగా ఎంపిక
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) చైర్మన్ రజనీశ్ కుమార్ పదవీ కాలం ఈ ఏడాది అక్టోబరుతో ముగియనున్న నేపథ్యంలో కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసేందుకు బ్యాంక్ బోర్డు బ్యూరో (బీబీబీ) రంగంలోకి దిగింది. ఎస్‌బీఐకి చెందిన నలుగురు ఎండీలను నిన్న ఇంటర్వ్యూ చేసిన బీబీబీ పనితీరు, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని దినేశ్ కుమార్ ఖారాను తదుపరి చైర్మన్‌గా, మరో ఎండీ చల్లా శ్రీనివాసులను రిజర్వు అభ్యర్థిగా ప్రతిపాదించింది. రజనీశ్ మూడేళ్ల పదవీకాలం అక్టోబరు 7తో ముగియనున్న నేపథ్యంలో ఆయన స్థానాన్ని దినేశ్ కుమార్ భర్తీ చేయనున్నారు.
SBI
Chaiman
Dinesh Kumar khara
BBB

More Telugu News