Pawan Kalyan: రాజధాని తరలింపు వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చిన హైకోర్టు... పవన్ సమాలోచనలు

Pawan Kalyan decides to know party leaders opinions on capital shifting
  • పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్న పవన్
  • రేపు నేతలతో టెలి కాన్ఫరెన్స్
  • ఆ తర్వాతే కౌంటర్ దాఖలుపై నిర్ణయం
ఏపీలో రాజధాని తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని తరలింపు వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయడానికి హైకోర్టు అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చింది. దీనిపై జనసేన పార్టీ కూడా సన్నద్ధమవుతోంది. అయితే ఈ అంశంలో కోర్టు ఆదేశాలు అందాల్సి ఉందని పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ పేర్కొన్నారు.

 ఈలోపు జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. పార్టీ నేతలతో రేపు టెలి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలంటూ కార్యాలయ సిబ్బందికి స్పష్టం చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాజధాని తరలింపు, ఇతర పరిణామాలపై పవన్ తన పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఆపై, రాజధాని తరలింపుపై కౌంటర్ దాఖలుకు నిర్ణయం తీసుకుంటారు.
Pawan Kalyan
AP Capital
AP High Court
Janasena
Andhra Pradesh

More Telugu News