YV Subba Reddy: అధికమాసం కారణంగా రెండుసార్లు శ్రీవారి బ్రహ్మోత్సవాలు... భక్తుల్లేకుండానే నిర్వహిస్తామన్న టీటీడీ

TTD Chairman YV Subbareddy explains about Brahmotsavams in Tirumala
  • తిరుమలలో సమావేశమైన టీటీడీ పాలకమండలి
  • సెప్టెంబరు 19 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు
  • ఆలయం లోపలే బ్రహ్మోత్సవాలు
తిరుమల అన్నమయ్య భవన్ లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి బ్రహ్మోత్సవాలపై నిర్ణయం తీసుకున్నారు. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరాలు తెలిపారు.

అధికమాసం కారణంగా ఈసారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు వచ్చాయని వెల్లడించారు. సెప్టెంబరు 19 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని చెప్పారు. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో స్వామివారి వాహన సేవలు తిరుమల మాడవీధుల్లో నిర్వహించడం వీలుకాదని, అందుకే బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా ఆలయంలోనే నిర్వహిస్తామని వివరించారు. ఒకవేళ కరోనా ప్రభావం తగ్గితే తదుపరి బ్రహ్మోత్సవాలను పూర్వరీతిలో వెలుపల నిర్వహిస్తామని తెలిపారు. 
YV Subba Reddy
TTD
Brahmotsavam
Tirumala
Corona Virus

More Telugu News