Sushant Singh Rajput: సుశాంత్ నాకు సోదరుడిలాంటి వాడు.. ఆయన మాజీ ప్రియురాలు నాకు స్నేహితురాలు అంతే!: నటుడు కుశాల్

sushant like my brother kushal
  • అంకితా లోఖండేతో తాను డేటింగ్‌ చేశానన్న వార్తలపై మండిపాటు
  • ఇలా రాయడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం
  • దీన్ని జర్నలిజం అంటారా?
  • ఈ ఆటలో నన్ను భాగస్వామిని చేయొద్దు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో విచారణ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో సుశాంత్ మాజీ ప్రియురాలు అంకితా లోఖండేని కూడా సీబీఐ అధికారులు ప్ర‌శ్నించారు. ఈ నేపథ్యంలో తనకు, అంకితకు లింకు పెడుతూ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ తాజాగా ప్రచురించిన ఓ కథనంపై నటుడు కుశాల్‌ టాండన్‌ మండిపడ్డాడు.

సుశాంత్ సింగ్‌ను ప్రేమించి, బ్రేకప్ చెప్పిన అనంతరం తనతో అంకిత కొన్నాళ్లు డేటింగ్‌ చేసిందంటూ అందులో పేర్కొనడంపై అభ్యంతరాలు చెప్పాడు. సుశాంత్‌ తనకు సోదరుడిలాంటి వాడని, అంకిత లోఖండే మంచి మిత్రురాలని తెలిపాడు. ఇలా రాయడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయమని, దీన్ని జర్నలిజం అంటారా? అని నిలదీశాడు. ఇతరులపై నిందలు వేస్తూ ఆడుతోన్న ఆటలో తనను భాగస్వామిని చేయొద్దని కోరాడు.

ఇటువంటి వార్తలు ప్రచురించే ప్రపంచంలో ఉన్నందుకు షాక్‌ అవుతున్నానని కుశాల్ చెప్పుకొచ్చాడు. అలాగే, హీరో సుశాంత్‌ మృతిని ఒక సర్కస్‌లా చేశారని ఆయన చెప్పాడు. దయచేసి ఆయన ఆత్మను ప్రశాంతంగా ఉండనివ్వాలని కోరాడు. ఈ పరిణామాలను చూసి స్వర్గంలో ఉన్న సుశాంత్ నవ్వుకుంటాడని, ఎప్పటిలానే వీటన్నింటిని ఆయన ఆత్మ సులువుగా‌ తీసుకోవాలని కోరాడు.
Sushant Singh Rajput
Bollywood
CBI

More Telugu News