Ram Charan: వాళ్లిద్దరిలో చరణ్ ముందుగా ఎవరికి ఓకే చెబుతాడో!

Charan to decide whom he gives nod first
  • లాక్ డౌన్ లో కథలు విన్న చరణ్ 
  • 'అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ కథకి ఓకే
  • 'జెర్సీ' ఫేం గౌతమ్ కూడా చెప్పిన కథ
  • 'ఆర్.ఆర్.ఆర్' తర్వాత సినిమాపై సస్పెన్స్  
లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులు నిలిచిపోవడంతో దర్శక నిర్మాతల షెడ్యూల్స్ అన్నీ అప్ సెట్ అయ్యాయి. దీంతో ఆయా తారల డేట్స్ కూడా ఎటూకాకుండాపోయాయి. వివిధ సినిమాల షూటింగులకు వీటిని మళ్లీ సర్దుబాటు చేసుకోవాలి. రామ్ చరణ్ నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' పరిస్థితి కూడా అలాగే వుంది. అసలు ఆ సినిమా ఈపాటికి రిలీజ్ అయిపోవాలి. అలాంటిది షూటింగు కూడా పూర్తికాలేదు. దీంతో చరణ్ దీని తర్వాత ఇక గ్యాప్ రాకుండా ఉండేలా తన తదుపరి చిత్రాలను ప్లాన్ చేసుకుంటున్నాడు.  

ఈ లాక్ డౌన్ ఖాళీ సమయంలో తను పలు కథలు విన్నాడట. వాటిలో ఇద్దరు దర్శకులు చెప్పిన కథలు నచ్చినట్టుగా తెలుస్తోంది. 'జెర్సీ' ఫేం గౌతమ్ తిన్ననూరి, 'అర్జున్ రెడ్డి' ఫేం సందీప్ రెడ్డి వంగా ఇద్దరూ చెప్పిన కథలకు చరణ్ ఓకే చెప్పినట్టు సమాచారం. దీంతో, వీరిద్దరూ పూర్తి స్క్రిప్టు పనిలో పడ్డారట. అయితే, వీరిలో ఎవరికి ముందుగా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్నది చూడాలి.  
Ram Charan
RRR
Sandip Reddy
Goutham Tinnanuri

More Telugu News