Botsa Satyanarayana: అమరావతి రైతుల ఖాతాలో డబ్బులు వేసినా విపక్షాలు కావాలనే రెచ్చగొడుతున్నాయి: బొత్స

Botsa alleges opposition parties intentionally provokes Amaravati farmers
  • నిన్న రాజధాని రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • కౌలు ఆలస్యం కావడంతో రైతుల ఆందోళన
  • సాంకేతిక కారణాలతోనే ఆలస్యమైందన్న బొత్స
వార్షిక కౌలు చెల్లింపు కోసం డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు నిన్న విజయవాడలో ముట్టడికి యత్నించగా, పోలీసులు వారిని అరెస్ట్ చేయడం తెలిసిందే. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ అంశంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు వారి ఖాతాల్లో డబ్బు జమ చేశామని, కానీ విపక్షాలు ఉద్దేశపూర్వకంగానే రైతులను రెచ్చగొడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతికపరమైన ఇబ్బందుల వల్ల రైతులకు కౌలు చెల్లించడంలో ఆలస్యమైందని వెల్లడించారు. కాగా, అమరావతి కౌలు రైతులకు పెన్షన్ రూ.5 వేల వరకు పెంచాలని భావించినా, ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లడంతో వీలుపడలేదని బొత్స వెల్లడించారు. అందువల్లే ఈసారి రూ.2,500 చెల్లించామని వివరించారు.
Botsa Satyanarayana
Opposition Parties
Amaravati
Farmers
Pension
Andhra Pradesh

More Telugu News