Guest House: వైజాగ్ లో గెస్ట్ హౌస్ కోసం 30 ఎకరాలు కేటాయిస్తూ జీవో జారీ చేసిన ఏపీ సర్కారు

AP Government allocates thirty acres land in Visakha for guest house
  • విశాఖలో భారీ ప్రభుత్వ గెస్ట్ హౌస్
  • నిర్మాణ బాధ్యతలు వీఎంఆర్డీఏకి అప్పగింత
  • భూ రికార్డులు సిద్ధం చేయాలంటూ కలెక్టర్ కు ఆదేశాలు
విశాఖలో నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ గెస్ట్ హౌస్ కోసం ఏపీ సర్కారు 30 ఎకరాలు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాపులుప్పాడ గ్రేహౌండ్ భూముల్లో ఈ గెస్ట్ హౌస్ ను నిర్మిస్తున్నారు.

ఈ క్రమంలో ప్రతిపాదిత అతిథి గృహం నిర్మాణం కోసం భూ రికార్డులు సిద్ధం చేయాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. అత్యవసర ప్రాతిపదికన నిర్మాణం జరపాలంటూ జీవోలో పేర్కొన్నారు. కాగా, ఈ భారీ గెస్ట్ హౌస్ నిర్మాణం బాధ్యతలను ప్రభుత్వం వీఎంఆర్డీఏ (విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ)కి అప్పగించింది. దీనిపై వీఎంఆర్డీఏ ఇప్పటికే గెస్ట్ హౌస్ డిజైన్ల కోసం టెండర్లు కూడా పిలిచింది.
Guest House
Land
G.O
Visakhapatnam
YSRCP
Andhra Pradesh

More Telugu News