Budda Venkanna: 'వెన్నుపోటు' అంశంపై విజయసాయి ట్వీట్.. బుద్ధా వెంకన్న కౌంటర్ ట్వీట్

Buddha Venkanna comments on CM Jagan in the wake of YS Viveka murder
  • సోనియమ్మకు వెన్నుపోటు అంటూ విమర్శలు
  • వివేకా బాబాయ్ కి బాత్ రూమ్ పోటు అంటూ బుద్ధా ట్వీట్ 
  • బాబు గారి వెన్నుపోటు ఢిల్లీ స్థాయిలో మార్మోగిందన్న విజయసాయి  
  • ఆంధ్రా ఔరంగజేబ్ గా కలకాలం గుర్తుండిపోతారంటూ వ్యాఖ్య 
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సీఎం జగన్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వెన్నుపోట్లలో బాత్ రూమ్ పోట్లు వేరయా! అంటూ ట్వీట్ చేశారు. సోనియమ్మకు వెన్నుపోటు, వివేకా బాబాయ్ కి బాత్ రూమ్ పోటు అంటూ విమర్శించారు.

"తండ్రీకొడుకులకు రాజకీయభిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీనే భక్షించిన వెన్నుపోటుదారుడు జగన్ ను నమ్మితే అంతేనంటూ ఢిల్లీలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉమ్మడి అభిప్రాయానికి వచ్చారట!" అంటూ బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.

బాబు గారి వెన్నుపోటు ఢిల్లీ స్థాయిలో మార్మోగింది: విజయసాయిరెడ్డి

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వెన్నుపోటు అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై విమర్శలు చేశారు. బాబు గారి వెన్నుపోటు మరోసారి ఢిల్లీ స్థాయిలో మార్మోగింది అంటూ ట్వీట్ చేశారు. పాపం పండి పవర్ లో లేకుండా పోయారని, త్వరలోనే రాజకీయాల నుంచి కూడా నిష్క్రమణ తప్పదని హస్తినలో అనుకుంటున్నారని పేర్కొన్నారు. "వెన్నుపోటు రాజకీయాలకు కాలం చెల్లిపోయింది బాబూ, కానీ మీరు ఆంధ్రా ఔరంగజేబ్ గా కలకాలం గుర్తుండిపోతారు... పెద్దాయన సాక్షిగా!" అంటూ ట్విట్టర్ లో స్పందించారు.
Budda Venkanna
Jagan
YS Vivekananda Reddy
Sonia Gandhi
Congress

More Telugu News