Bigg Boss: కొత్త హీరోయిన్‌ను పెళ్లి చేసుకోనున్న తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ 1 విజేత

arav going to get marriedd heron
  • ఏడాదిగా ప్రేమాయణం
  • ప్రస్తుతం ఆరవ్‌ నటించిన రాజా భీమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు
  • గౌతం మీనన్‌ దర్శకత్వంలో తొలిసారి హీరోయిన్‌గా నటిస్తోన్న రేహి
తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌ 1 విజేత, సినీటుడు  ఆరవ్‌ నఫీజ్‌, తన ప్రేయసి, హీరోయిన్‌ రేహిని పెళ్లి చేసుకోబోతున్నాడు. గత ఏడాది కాలంగా వీరిద్దరు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఇరు కుటుంబ పెద్దల సమక్షంలో వీరి పెళ్లి జరగనుంది. సెప్టెంబరు 6న చెన్నైలో వీరి వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించినట్లు తెలిసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిరాడంబరంగా వీరి వివాహం జరగనుంది.

ఆరవ్‌ నటించిన తొలి సినిమా రాజా భీమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకొంటోంది.  నరేశ్‌ సంపత్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే, లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడుతుంది. కాగా, గౌతం మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జోషువా ఇమాయి పోల్‌ కాకా’ అనే రొమాంటిక్‌ సినిమాలో హీరోయిన్‌గా రేహి నటిస్తోంది. ఈ సినిమాతో ఆమె సినీరంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.  

Bigg Boss
Tamilnadu
marriage

More Telugu News