Chittoor District: భార్యపై అనుమానంతో ఆమె కాళ్లు, చేతులను నరికేసిన చిత్తూరు యువకుడు

man kills his wife
  • ఆరు నెలల క్రితమే వివాహం 
  • అనుమానం పెంచుకుని గొడవలు
  • పోలీసు స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయిన భర్త
చిత్తూరు  జిల్లా శ్రీకాళహస్తిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యపై అనుమానాన్ని పెంచుకున్న ఓ యువకుడు కత్తితో ఆమె కాళ్లు, చేతులను నరికేసి పోలీసు స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. శ్రీకాళహస్తికి చెందిన వెంకటేశ్ అనే యువకుడికి ఆరు నెలల క్రితమే నెల్లూరుకు చెందిన దుర్గ అనే యువతితో పెళ్లి జరిగింది.

కొన్ని నెలలు బాగానే ఉన్న వెంకటేశ్‌కు కొన్ని రోజులుగా భార్య మీద అనుమానం కలిగింది. ఆమె ఇతర వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని ఆరోపించేవాడు. ఈ విషయంపై దుర్గతో తరుచూ గొడవకు దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె నిద్రపోతున్న సమయంలో ఆమె కాళ్లు, చేతులు నరికేశాడు. ప్రస్తుతం ఆమె నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.
Chittoor District
Crime News

More Telugu News