Sania Mirza: తన కుమారుడితో దిగిన క్యూట్ ఫొటోలను పోస్ట్ చేసిన సానియా మీర్జా

Sania Mirza Shares Cute Pics With Son Izhaan
  • 'నువ్వు నాలో భాగం కన్నా' అంటూ పోస్ట్
  • గార్డెన్‌లో కొడుకుతో నడిచిన సానియా
  • సరదాగా ఇజాన్ మిర్జాతో ముచ్చట్లు
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన కుమారుడు ... ఇజాన్ మీర్జా మాలిక్ ఫొటోను పోస్ట్ చేశారు. 'నువ్వు నాలో భాగం కన్నా' అంటూ ఆమె ఈ ఫొటోకి క్యాప్షన్ ఇచ్చారు.

ఆమె ట్వీట్ చేసిన ఈ ఫొటోపై టీవీ యాంకర్ గౌరవ్ కపూర్ స్పందిస్తూ 'ఈ రోజు మీ బాబు ఏం మాట్లాడాడు?' అని కామెంట్ చేశారు. దీంతో సానియా రిప్లై ఇస్తూ.. 'ఈ రోజు అన్న పదం ఏంటంటే కేక్‌, ఇంకా ఎన్నో' అని పేర్కొంది.

తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఈ ఫొటోలో ఆమె తన కుమారుడు ఇజాన్‌తో కలిసి గార్డెన్‌లో నడుచుకుంటూ వెళ్తున్నట్లు ఉంది. మరో ఫొటోలో తన కుమారుడితో ఆమె ముచ్చటిస్తున్నట్టుంది. సానియా మీర్జా తన కుమారుడికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను తరుచూ పోస్ట్ చేస్తుంటుంది.
Sania Mirza
tennis
Twitter

More Telugu News