ఎస్ఐ దగ్గర ఐస్ క్రీమ్ కు డబ్బులు ఎక్కువ తీసుకున్న రెస్టారెంట్... ఆపై బుక్కయిన వైనం!
- ముంబైలో 2014లో ఘటన
- రూ.10 అదనంగా తీసుకున్న రెస్టారెంట్
- 2.45 లక్షల జరిమానా విధించిన కోర్టు
ఈ ఘటన 2014 జూన్ లో షగుణ్ వెజ్ రెస్టారెంట్ లో జరిగింది. ఆపై జాదవ్, తన నుంచి అదనంగా డబ్బు తీసుకున్న రెస్టారెంట్ పై కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు దాదాపు ఐదున్నరేళ్లకు పైగా సాగగా, ఇంతకాలానికి న్యాయం పొందారు. రెస్టారెంట్ అదనంగా డబ్బులు వసూలు చేయడం తప్పేనంటూ రూ. 2.45 లక్షల జరిమానాను న్యాయస్థానం విధించింది.