Rhea Chakraborthy: హీరోయిన్ రియా చక్రవర్తికి బిగుస్తున్న ఉచ్చు.. కేసు నమోదు చేసిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో!

Narcotics Control Bureau registers a case against Rhea Chakraborty
  • డ్రగ్స్ డీలర్ తో రియా వాట్సాప్ చాటింగ్
  • చాట్ ను ఫోన్ నుంచి తొలగించిన రియా
  • డ్రగ్స్ మాఫియాతో సంబంధాలను నిర్ధారించిన నార్కోటిక్స్ బ్యూరో
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అతని మాజీ ప్రియురాలు, హీరోయిన్ రియా చక్రవర్తిపై కేసులు నమోదైన సంగతి తెలిపిందే. సీబీఐ సైతం ఈ కేసును విచారిస్తోంది.

ఈ నేపథ్యంలో, డ్రగ్ డీలర్ గౌరవ్ ఆర్యతో రియా వాట్సాప్ చాటింగ్ చేసిందనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చాట్ ను తన ఫోన్ నుంచి రియా తొలగించినా... అధికారులు దాన్ని తిరిగి పొందారు. రియాకు, డ్రగ్స్ మాఫియాకు సంబంధాలు ఉన్నాయని నిర్ధారించుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆమెతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది.
Rhea Chakraborthy
Bollywood
Drugs Mafia
Sushant Singh Rajput
Narcotics Control Bureau

More Telugu News