Andhra Pradesh: ఏపీలో మరోసారి 10 వేలు దాటిన కరోనా కొత్త కేసులు.. తాజా అప్డేట్స్!

AP witnesses more than 10000 new corona cases in last 24 hours
  • గత 24 గంటల్లో 10,830 కేసుల నమోదు
  • ప్రాణాలు కోల్పోయిన 81 మంది
  • 3,82,469కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
ఏపీలో గత 24 గంటల్లో నమోదైన కరోనా కొత్త కేసుల సంఖ్య మరోసారి 10 వేలు దాటింది. రాష్ట్రంలో మొత్తం 10,830 తాజా కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఈ జిల్లాలో కొత్తగా 1,528 కొత్త కేసులు నమోదు కాగా... 1,168 కేసులతో నెల్లూరు జిల్లా రెండో స్థానంలో ఉంది. గత 24 గంటల్లో మొత్తం 61,838 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 81 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా గణాంకాలను కలిపితే... ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,82,469కి పెరిగింది. 3,541 మంది మృతి చెందారు. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 92,208గా ఉండగా... 2,86,720 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Andhra Pradesh
Corona Virus
Cases

More Telugu News