Mahesh Babu: రామోజీరావు గారికి అభినందనలు: మహేశ్ బాబు

Mahesh Babu greets Ramoji Rao
  • 25 వసంతాలను పూర్తి చేసుకున్న ఈటీవీ
  • ఈటీవీ నెట్ వర్క్ ఎదిగిన తీరు సంతోషకరమన్న మహేశ్
  • సిబ్బందికి, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపిన సూపర్ స్టార్
సోషల్ మీడియా ద్వారా తన జీవితానికి సంబంధించిన విషయాలపై, సినిమాలపై మాత్రమే సినీ నటుడు మహేశ్ బాబు స్పందిస్తుంటారు. ఇతర అంశాలపై ఆయన స్పందించడం చాలా తక్కువనే చెప్పుకోవాలి. అయితే, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావును ఉద్దేశించి మహేశ్ ఈరోజు స్పందించారు.

ఈటీవీ 25 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీకి మహేశ్ శుభాకాంక్షలు తెలిపారు. 'రెండు దశాబ్దాలకు పైగా ప్రయాణం. ఈనాడు నెట్ వర్క్ ఎదిగిన తీరు చాలా సంతోషకరం. 25 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీరావు గారికి, ఈటీవీ సిబ్బందికి, ప్రేక్షకులకు శుభాకాంక్షలు' అని మహేశ్ ట్వీట్ చేశారు.
Mahesh Babu
Tollywood
Ramoji Rao
ETV

More Telugu News