Trisha: మూడేళ్లుగా ఆగిపోయిన త్రిష సినిమా.. త్వరలో ఓటీటీ ద్వారా విడుదల

Trisha starrer Saturanga Vettai sequel will release through Amezon Prime
  • ఇరవై ఏళ్లుగా రాణిస్తున్న కథానాయిక త్రిష
  • మూడేళ్ల క్రితం నటించిన 'శతురంగ వెట్టయ్ -2'
  • స్ట్రీమింగ్ హక్కులను తీసుకున్న అమెజాన్ ప్రైమ్  
సినిమా రంగం అంటేనే నిత్యం పోటీతో కూడుకున్నది. అందులోనూ హీరోయిన్ల విషయం చెప్పాలంటే మరీనూ. ప్రతి శుక్రవారం కొత్త అమ్మాయిలు ప్రత్యక్షమయ్యే రంగమిది. దాంతో ఎంతగా హిట్లు వచ్చినా కూడా ఎక్కువ కాలం ఇక్కడ కొనసాగలేరు. తమ స్థానాన్ని మరొకరికి అప్పగించి వెళ్లిపోవాల్సిందే.

అలాంటి విపరీతమైన పోటీ వున్న ఈ రంగంలో గత రెండు దశాబ్దాలుగా కథానాయికగా అగ్ర స్థానంలో కొనసాగడం అంటే మాటలు కాదు. అది అందాలతార త్రిషకు సాధ్యమైంది. తను వచ్చి ఇరవై ఏళ్లు గడిచినా.. తనకి 37 ఏళ్లు వచ్చినా.. డిమాండ్ తగ్గకుండా ఇంకా అగ్ర స్థానంలోనే వుండి, సినిమాలు చేస్తున్న కథానాయిక తను.

ముఖ్యంగా తమిళంలో త్రిష కెరీర్ ఏమాత్రం సడలలేదు. కొత్త అమ్మాయిలు ఎందరు వచ్చినా తనకు వచ్చే సినిమాలు ఆమెకి వస్తూనే వున్నాయి. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం అరవింద్ స్వామితో కలసి త్రిష చేసిన చిత్రం 'శతురంగ వెట్టయ్ -2'. అయితే, వివిధ కారణాల వల్ల ఇది ఇంకా విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ మంచి రేటు ఆఫర్ చేసి హక్కుల్ని సొంతం చేసుకుంది. సో, థియేటర్లలో రిలీజ్ కాలేకపోయినా, త్వరలోనే ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్టుగా రిలీజ్ కానుంది.  
Trisha
Kollywood
Aravind Swamy
Amezon Prime

More Telugu News