Undavalli Sridevi: చంద్రబాబు లేఖను చూసి బీజేపీ నేతలు కూడా విస్తుపోతున్నారు: శ్రీదేవి

YSRCP MLA Sridevi fires on Chandrababu
  • ఇక గెలిచే అవకాశం లేదనే విషయం చంద్రబాబుకు అర్థమైంది
  • అందుకే ప్రభుత్వంపై కుట్రకు పాల్పడుతున్నారు
  • అనుకూల మీడియాలో లేనిపోని వార్తలు రాయిస్తున్నారు

తెలుగుదేశం పార్టీ ప్రజాక్షేత్రంలో గెలిచే అవకాశం లేదనే విషయం చంద్రబాబుకు తెలిసిపోయిందని... అందుకే వివిధ కుట్రలకు తెరలేపారని తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ చంద్రబాబు లేఖ రాయడం కూడా ఈ కుట్రలో భాగమేనని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ను దెబ్బతీయాలనే ఆలోచనతో... తన అనుకూల మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేనిపోని వార్తలను రాయిస్తున్నారని అన్నారు.

రిటైర్ట్ జడ్జ్ ఈశ్వరయ్య ఓ జూనియర్ జడ్జితో మాట్లాడిన విషయాలపై రాద్ధాంతం చేశారని... ఈ అంశాన్ని హైకోర్టుకు పంపించి వారికి కూడా సందేహాలు వచ్చేలా చేశారని శ్రీదేవి మండిపడ్డారు. గతంలో కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే ఎన్నో పనులను చంద్రబాబు చేశారని అన్నారు. చంద్రబాబు తీరు చాలా నీచంగా ఉందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఆయనను పొగిడిన తీరును చూసి బీజేపీ నేతలు సైతం విస్తుపోతున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News