Nara Lokesh: అవినీతిపై ఫిర్యాదుల కోసం మీ జైలు నెంబర్ నే టోల్ ఫ్రీ నెంబర్ గా పెడితే సరిపోతుంది: సీఎంపై నారా లోకేశ్ వ్యంగ్యం

Nara Lokesh satires on CM Jagan initiative against corruption
  • అవినీతిపై ఫిర్యాదుల కోసం 14400 నెంబర్ ప్రకటించిన సీఎం
  • జగన్ జైలు నెంబర్ 6093 అంటూ లోకేశ్ ట్వీట్
  • జగన్ రెడ్డి ఓసారి ఆలోచించాలంటూ కామెంట్స్
ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో అవినీతి నిర్మూలన చేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. సీఎం ప్రకటించిన 14400 టోల్ ఫ్రీ నెంబర్ పై వ్యంగ్యం ప్రదర్శించారు.

"జగన్ గారూ, అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు మీరు టోల్ ఫ్రీ నెంబర్ 14400 పెట్టారు. కానీ ప్రజల సొమ్ము రూ.43 వేల కోట్లు కొట్టేసి సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1గా చంచల్ గూడ జైల్లో 16 నెలలు గడిపిన మీకు జైల్లో ఇచ్చిన నెంబర్ 6093. ఇదే నెంబర్ ను అవినీతిపై ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ గా పెడితే సందర్భోచితంగా ఉండేది. మీరు దోచేసిన సొమ్ము ప్రభుత్వ ఖజానాకి జమచేసి, అప్పుడు అవినీతిపై మాట్లాడితే బాగుంటుంది జగన్ రెడ్డిగారూ... ఓసారి ఆలోచించండి" అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
Nara Lokesh
Jagan
Toll Free Number
Jail Number
14400
Andhra Pradesh

More Telugu News