Sarvanand: యువ పారిశ్రామికవేత్తను ప్రేమ వివాహం చేసుకోనున్న శర్వానంద్?

Actor Sarvanand to marry his  childhood friend
  • చిన్ననాటి స్నేహితురాలి ప్రేమలో శర్వానంద్
  • గత కొంతకాలంగా ప్రేమలో యువ హీరో
  • పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండు కుటుంబాలు
టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. నితిన్, నిఖిల్, రానా తదితరులంతా ఇటీవలే ఒక ఇంటివారు అయిపోయారు. ఇప్పుడు మరో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ వంతు వచ్చింది. తన చిన్ననాటి స్నేహితురాలిని శర్వా పెళ్లాడబోతున్నట్టు ఫిలింనగర్ టాక్. ఆమెతో గత కొంత కాలంగా శర్వా ప్రేమలో ఉన్నాడట. ప్రస్తుతం ఆమె యువ పారిశ్రామికవేత్తగా రాణిస్తున్నారట. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని సమాచారం. త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేసి... వివాహానికి సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారట.
Sarvanand
Tollywood
Marriage
Love

More Telugu News