Nagarjuna Sagar: శ్రీశైలం, నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు మూసివేత!

Crust Gates of Srisailam and Sagar Closed
  • ఎగువ నుంచి వస్తున్న వరద నీరు తగ్గుదల
  • 1.10 లక్షల క్యూసెక్కులు రాక
  • 40 వేల క్యూసెక్కులు దిగువకు

ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గడంతో, శ్రీశైలం, నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం శ్రీశైలానికి 1.10 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా, దాదాపు 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 50 వేల క్యూసెక్కులు వివిధ కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా వ్యవసాయ అవసరాల నిమిత్తం తరలిస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఇక శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు మూసివేసిన వెంటనే నాగార్జున సాగర్ గేట్లను కూడా మూసివేశారు. సాగర్ కు ప్రస్తుతం 70 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఈ సాయంత్రానికి అది మరింతగా తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News