కాంగ్రెస్ పార్టీ మధ్యంతర చీఫ్ గా సోనియానే!.. ఏ నిర్ణయం తీసుకోలేకపోయిన సీడబ్ల్యూసీ
- కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం
- ముగిసిన సీడబ్ల్యూసీ భేటీ
- సోనియా నాయకత్వంవైపే మొగ్గు
నేడు జరిగిన సీడబ్ల్యూసీ భేటీ హైడ్రామా నడుమ సాగింది. అయితే, పార్టీ ప్రెసిడెంట్ పదవి ఎవరికి అప్పగించాలన్న దానిపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సోనియానే మధ్యంతర చీఫ్ గా కొనసాగనున్నారు. పార్టీ బాధ్యతల నుంచి తనను తప్పించాలంటూ సోనియానే స్పష్టం చేసినా, ఈ పరిస్థితుల్లో మరో మార్గం లేక పార్టీ సీనియర్లు ఆమెపైనే భారం వేశారు.