సోషల్ మీడియాలో పోస్టు చేసే ప్రతిదీ నిజం కాదు... రాచకొండ పోలీసుల వినూత్న ప్రచారం
- పెరిగిపోతున్న ఫేక్ న్యూస్
- అనేక జీవితాలపై ఫేక్ న్యూస్ ప్రభావం
- ఫేక్ న్యూస్ పై రాచకొండ కమిషనరేట్ పోరుబాట
ఫేక్ న్యూస్ ను అరికట్టేందుకు కొన్నివీడియోల సాయంతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి పోస్టు నిజమే అని నమ్మవద్దు అని హితవు పలుకుతూ, రాచకొండ పోలీసులు తాజాగా ఓ వీడియో పోస్టు చేశారు.
అందులో రైలు పట్టాలపై సింహం పడుకుని ఉండగా, వేగంగా రైలు వస్తూంటుంది. చూసేవాళ్లకు ఆ రైలు సింహాన్ని తాకుతుంది అనిపించినా, అది గ్రాఫిక్స్ కావడంతో రైలు దానిపాటికి అది వెళ్లిపోతుంది. సింహం రైలు పట్టాలపై ఉన్నట్టు భ్రమించడానికి కారణం గ్రాఫిక్స్ అని ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది. ఫేక్ న్యూస్ కూడా ఇలాగే తయారుచేస్తారని, అదే నిజమని అనుకోరాదని రాచకొండ పోలీసులు వివరించారు.