Venkaiah Naidu: నా స్నేహితుడు... అంటూ అరుణ్ జైట్లీ చిన్ననాటి ఫొటోను పోస్టు చేసిన వెంకయ్యనాయుడు

Venkaiah Naidu posts childhood photo of his friend Arun Jaitly
  • నేడు అరుణ్ జైట్లీ ప్రథమ వర్ధంతి
  • నిష్కళంక రాజకీయనేత అని కొనియాడిన వెంకయ్యనాయుడు
  • జీఎస్టీ కోసం అవిరళ కృషి చేశారని వెల్లడి
భారత మాజీ ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తొలి వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విట్టర్ లో స్పందించారు. నా స్నేహితుడు... అంటూ అరుణ్ జైట్లీ చిన్ననాటి ఫొటో పోస్టు చేశారు. నా సన్నిహితుడు, భారతదేశ మాజీ ఆర్థికమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి అరుణ్ జైట్లీ వర్ధంతికి నివాళులు అర్పిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

 విశిష్ట న్యాయవాదిగా, సమర్థ నిర్వాహకుడిగా, నైపుణ్యం కలిగిన సంధానకర్తగా, నిష్కళంక రాజకీయనేతగా జైట్లీ సేవలు చిరస్మరణీయం అని వెంకయ్య కీర్తించారు. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విషయంలో ఏకాభిప్రాయం తీసుకురావడానికి జైట్లీ చేసిన అవిరళ కృషిని దేశం గుర్తుపెట్టుకుంటుంది అని, ఆయన చూపిన విలువలు, ఆదర్శాలను పాటించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అభిప్రాయపడ్డారు.

Venkaiah Naidu
Arun Jaitly
Death Anniversary
Photo
BJP
India

More Telugu News