Nagarjuna: నాగార్జున పుట్టినరోజు సీడీపీ... స్వయంగా తయారు చేయించిన సమంత!

Samantha Released Nagarjuna Birthday CDP
  • 29న నాగార్జున బర్త్ డే
  • ఆయనపై ఎంతో గౌరవం ఉంది
  • అదెన్నటికీ నిలిచే వుంటుందన్న సమంత
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున పుట్టిన రోజుకు ఇంకా ఐదు రోజుల సమయం ఉండగానే, సందడి మొదలైపోయింది. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ హడావుడి ప్రారంభించేశారు. ఇటీవల పవన్ కల్యాణ్ పుట్టిన రోజు స్పెషల్ డిస్ ప్లే పిక్చర్ హ్యాష్ ట్యాగ్ వరల్డ్ రికార్డును సృష్టించగా, ఆ వెంటనే వచ్చిన టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు బర్త్ డే హ్యాష్ ట్యాగ్, దాన్ని బీట్ చేసి, కొత్త రికార్డును సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడికి సమంత తన మామగారు నాగ్ సీడీపీని తయారు చేయించి, విడుదల చేసింది. దీన్ని విడుదల చేయడం తనకు దక్కిన గౌరవమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆయనపై తనకెంతో ప్రేమ, గౌరవం ఉన్నాయని, అవెన్నటికీ నిలిచే ఉంటాయని వ్యాఖ్యానించింది. ఈ సీడీపీని చూసిన ఫ్యాన్స్ అంతా సమంతను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఇక ఈ డిస్ ప్లే పిక్చర్ లో నాగ్ నటించిన పలు చిత్రాల్లోని స్టిల్స్ ఉన్నాయి. ఆయన అభిమానులు దీన్నిప్పుడు వైరల్ చేస్తున్నారు. ఈ నెల 29న నాగ్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే.
Nagarjuna
Samantha
Birth Day
CDP

More Telugu News