Jagan: పారిస్ 'ఇన్ సీడ్'లో సీటు సాధించిన వైఎస్ జగన్ కుమార్తె హర్షా రెడ్డి... రేపే ప్రయాణం!

Jagan Daughter Harsha Reddy Goes to Paris for MBA PG
  • ఎంబీఏ చేయనున్న హర్షా రెడ్డి
  • మంగళవారం బెంగళూరు నుంచి ప్రయాణం
  • వీడ్కోలు పలకనున్న కుటుంబ సభ్యులు
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లోని ప్రతిష్ఠాత్మక ఇన్ సీడ్ బిజినెస్ స్కూల్ లో, తన ఎంబీఏని పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద కుమార్తె హర్షా రెడ్డి బయలుదేరనున్నారు. ఇప్పటికే ఆ కాలేజీలో హర్షాకు సీటు లభించగా, మంగళవారం నాడు ఆమె లండన్ కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జగన్ కుటుంబమంతా ఆమెకు వీడ్కోలు ఇచ్చేందుకు బెంగళూరు వరకూ వెళతారని తెలుస్తోంది. కాగా, హర్ష లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మరోపక్క చిన్న కుమార్తె వర్ష యూఎస్, ఇండియానా రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ ఆఫ్ నార్టే డామ్ లో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతోంది. 
Jagan
Harsha Reddy
MBA PG
Paris

More Telugu News