Vijayashanti: దక్షిణ భారత సినీ గీతాలకు ఎస్పీబీ ఒక బ్రాండ్ నేమ్: విజయశాంతి

Vijayasanthi says SP Balasubrahmanyam a brand name for south indian cinema songs
  • కరోనా బారినపడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
  • చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స
  • త్వరగా కోలుకోవాలంటూ విజయశాంతి ఆకాంక్ష
కరోనా మహమ్మారి బారినపడిన గానగంధుర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలంటూ సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి అకాంక్షించారు. బాలు గారు, తన  54 సంవత్సరాల సుదీర్ఘమైన కళాప్రస్థానంలోసాధించుకున్న అశేషమైన అభిమానుల ప్రేమ, పూజలతో కచ్చితంగా తిరిగి వస్తారని విశ్వసిస్తున్నానంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.

దక్షిణ భారత సినీ గీతాలకు ఎస్పీబీ ఒక బ్రాండ్ నేమ్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని పేర్కొన్నారు. ఎస్పీ బాలు ప్రస్తుతం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో కరోనాతో పోరాడుతున్నారు. ఆయనకు ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
Vijayashanti
SP Balasubrahmanyam
Brand Name
South India
Cinema Songs
Corona Virus

More Telugu News