MS Dhoni: పాక్ క్రికెటర్ డేటింగ్ ఆశలను సిక్సర్ తో 'దెబ్బ' కొట్టిన ధోనీ!

when Dhoni smashed a Pakistani cricketer dating plan

  • కెన్యాలో ముక్కోణపు సిరీస్ ఆడిన ధోనీ
  • పాక్ తో మ్యాచ్ లో వీరవిహారం
  • ప్రేక్షకుల్లో ఉన్న భారత అమ్మాయితో పాక్ క్రికెటర్ పరిచయం
  • మ్యాచ్ తర్వాత డేటింగ్ కు వెళ్లాలని ఇరువురి నిర్ణయం
  • ధోనీ కొట్టిన షాట్ తగిలి అమ్మాయి ఆసుపత్రిపాలు

ఇటీవలే ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ కెరీర్ లో ఎన్నో చిరస్మరణీయ ఘట్టాలున్నాయి. ధోనీ సాధించిన విజయాలను పక్కనబెడితే, సుదీర్ఘమైన కెరీర్ లో అనేక ఆసక్తికర అంశాలకు కూడా చోటుంది. ధోనీ టీమిండియాకు ఎంపిక అవడానికి ముందు కెన్యాలో జరిగిన ముక్కోణపు సిరీస్ లో ఇండియా-ఏ జట్టుకు ఆడాడు. ఆ టోర్నీలో పాకిస్థాన్-ఏ జట్టు కూడా ఆడింది.

ఆ టోర్నీలో ధోనీ పరుగుల వరద పారించాడు. ఆడిన అన్ని మ్యాచ్ ల్లో కలిపి 360 రన్స్ సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అయితే, ఆ టోర్నీలో పాకిస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా ధోనీ కారణంగా ఓ పాక్ క్రికెటర్ డేటింగ్ ఆశలు అడియాసలయ్యాయి. భారత్ బ్యాటింగ్ సమయంలో ధోనీ పిడుగుల్లాంటి షాట్లతో పాక్ బౌలర్లను బెంబేలెత్తించాడు.

ఆ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్న ఓ పాక్ ఆటగాడు ప్రేక్షకుల్లో ఉన్న ఓ భారత అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. ఆ కాసేపటి పరిచయంలోనే వాళ్లిద్దరూ డేటింగ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ ధోనీ కొట్టిన ఓ సిక్సర్ నేరుగా వచ్చి ఆ అమ్మాయిని తాకడంతో ఆమె తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి వెళ్లాల్సివచ్చింది. ఆ విధంగా  ఆ పాక్ క్రికెటర్ డేటింగ్ ఆశలకు ధోనీ కొట్టిన షాట్ బ్రేక్ వేసింది. పాపం, ఆ పాక్ క్రికెటర్ ఉసూరుమంటూ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లాల్సి వచ్చింది.

  • Loading...

More Telugu News