దావూద్ విషయంలో 24 గంటలైనా గడవకముందే పాకిస్థాన్ యూటర్న్
- తనకు అలవాటైన బుద్ధిని మరోమారు ప్రదర్శించిన పాక్
- దావూద్ తమ దేశంలో లేడని, అతడికి ప్రవేశం లేదని పేర్కొన్న దాయాది
- భారత్ మీడియా పాక్‌కు వ్యతిరేకంగా కథనాలు రాస్తోందని మండిపాటు
ఈ జాబితాలో దావూద్ పేరును చేర్చి కొన్ని గంటలైనా గడవకముందే పాకిస్థాన్ తనకు అలవాటైన బుద్ధిని మరోమారు ప్రదర్శించింది. దావూద్ తమ దేశంలో లేడని, అతడికి తమ దేశంలోకి అసలు ప్రవేశమే లేదని పేర్కొంది. భారత మీడియా కావాలనే దావూద్ తమ దేశంలో ఉన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తోందని పాక్ విదేశాంగ శాఖ ఆరోపించింది. గతంలో జారీ చేసిన ఎస్ఆర్ఓ (చట్టబద్ధమైన నోటిఫికేషన్)ను బూచిగా చూపుతూ భారత మీడియా కథనాలు నడిపిస్తోందని, అది సరికాదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి జాహిద్ చౌధరి అన్నారు.