MS Dhoni: దటీజ్ ధోనీ... బిజినెస్ క్లాస్ వదిలేసి, సాధారణ ప్రయాణికుల మధ్యకు... వీడియో ఇదిగో!

Dhoni swaps his Business Class seat with Economy Class Passenger
  • సీఎస్కే సభ్యులతో కలిసి దుబాయ్ కి పయనం
  • ఓ ప్రయాణికుడి కాళ్లు పొడవుగా ఉండటంతో గమనించిన ధోనీ
  • తన సీట్ అతనికి ఇచ్చి ఎకానమీలో ప్రయాణించిన ధోనీ
మిస్టర్ కూల్ గా పేరు, ఎప్పుడూ ఎంతో సాదాసీదాగా ఉంటాడని పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, తాజాగా, విమానంలో తనకు కేటాయించిన బిజినెస్ క్లాస్ సీట్ ను ఓ సాధారణ ప్రయాణికుడికి ఇచ్చి, తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఐపీఎల్ లో పాల్గొనేందుకు సీఎస్కే తరఫున దుబాయ్ కి బయలు దేరిన వేళ, ఈ ఘటన జరిగింది.

ధోనీతో పాటు చాలా మంది సీఎస్కే సభ్యులు, సహాయక సిబ్బంది, చెన్నై నుంచి దుబాయ్ కి బయలుదేరారు. ఈ విమానంలో ధోనీకి బిజినెస్ క్లాస్ లో సీట్ ను కేటాయించారు. విమానంలోని మరో ప్రయాణికుడి కాళ్లు చాలా పొడవుగా ఉండటంతో సాధారణ సీట్లో అతను కూర్చుని ఇబ్బంది పడుతూ ఉండటాన్ని గమనించిన ధోనీ, అతనికి తన సీట్ ను ఇచ్చి, తాను వెళ్లి ఎకానమీ క్లాస్ లో కూర్చున్నారు. జార్జ్ అనే ట్విట్టర్ యూజర్, ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ధోనీ అద్భుతమైన వ్యక్తని కితాబిచ్చారు. ఈ వీడియోలో ధోనీ, ఎకానమీ క్లాస్ లూ కూర్చుని మరో క్రికెటర్ సురేశ్ రైనాతో చాట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.
MS Dhoni
CSK
Flight

More Telugu News