Gas Cylinder: గ్యాస్ సిలిండర్ లో మద్యం బాటిళ్లు... ఎలా అక్రమరవాణా చేస్తున్నారో చూడండి!

Liquor bottles in a gas cylinder as illegal transport busted in Krishna district
  • కృష్ణా జిల్లా వత్సవాయి వద్ద ఘటన
  • సిలిండర్ అడుగుభాగంలో మూత ఏర్పాటు
  • 100 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
మద్యం అక్రమ రవాణా చేసేందుకు ఎలాంటి ఎత్తుగడ వేశారో చూస్తే ఆశ్చర్యపోతారు. మద్యం బాటిళ్లను ఏకంగా గ్యాస్ సిలిండర్లలో తరలిస్తూ దొరికిపోయారు. ఇది జరిగింది ఎక్కడో కాదు కృష్ణా జిల్లాలోనే. గ్యాస్ సిలిండర్ అడుగుభాగంలో ఓ మూత ఏర్పాటు చేసి దాంట్లో క్వార్టర్ బాటిళ్లతో నింపేశారు.

జగ్గయ్యపేట సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి తెలంగాణ నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సైతం ఈ సిలిండర్ టెక్నిక్ చూసి విస్తుపోయారు. ఈ దాడుల్లో పాల్గొన్న వత్సవాయి పోలీసులు 100 క్వార్టర్ బాటిళ్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కృష్ణా జిల్లా పోలీసులు ట్విట్టర్ లో పంచుకున్నారు.

Gas Cylinder
Liquor Bottles
Illegal Transport
Police
Krishna District

More Telugu News