Raghu Ramakrishna Raju: వై కేటగిరీ భద్రతలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఫొటో ఇదిగో!
సొంత పార్టీ నేతల నుంచే తనకు ప్రమాదం పొంచి ఉందని, తనకు కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు విన్నవించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం ఆయనకు వై కేటగిరీ భద్రతను కల్పించింది. కేంద్ర బలగాల మధ్యలో నిలబడి ఉన్న రఘురాజు ఫోటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మరోవైపు అమరావతిలో తాను పర్యటించాలనుకుంటున్నానని... తన పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ డీజీపీకి రఘురాజు లేఖ రాసిన సంగతి తెలిసిందే.