Nara Lokesh: తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం...  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన లోకేశ్

Nara Lokesh furious over demolition of NTR statue in Tenali
  • కూలగొడితే కూలిపోవడానికి ఆయన విగ్రహం కాదన్న లోకేశ్
  • ప్రజల మనసుల్లో కొలువైన దైవం అంటూ ట్వీట్
  • ధ్వంసం చేసిన వారిని శిక్షించాలంటూ డిమాండ్
గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలగొడితే కూలిపోవడానికి, ధ్వంసం చేసినంత మాత్రాన ధ్వంసమైపోవడానికి ఆయన విగ్రహం కాదని, ప్రజల హృదయాల్లో కొలువైన దైవం అని పేర్కొన్నారు.

నందమూరి తారకరామారావు విగ్రహాలు లేకుండా చేయడం ద్వారా ప్రజలకు ఆయన్ని దూరం చేయగలమని సైకో మనస్తత్వంతో ఆలోచించే జగన్, వైసీపీ నాయకులు అనుకుంటున్నారని విమర్శించారు. "ప్రజల నుంచి ఎన్టీఆర్ ను దూరం చేయడం మీ తరం కాదు. తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి రాక్షస ఆనందం పొందిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలి" అని లోకేశ్ ట్వీట్ చేశారు.
Nara Lokesh
NTR
Statue
Demolition
Tenali
Guntur District

More Telugu News