చిత్తూరు జిల్లాలోని హాట్సన్ పాల డెయిరీలో అమ్మోనియం గ్యాస్ లీక్.. 20 మందికిపైగా అస్వస్థత

చిత్తూరు జిల్లాలోని హాట్సన్ పాల డెయిరీలో అమ్మోనియం గ్యాస్ లీక్.. 20 మందికిపైగా అస్వస్థత

20 hospitalised after ammonia gas leak at Chittoor dairy unit
  • ప్రమాద సమయంలో 100 మందికిపైగా కార్మికులు
  • అస్వస్థతకు గురైన వారిలో 14 మంది మహిళా కార్మికులు
  • విచారణకు ఆదేశించిన మంత్రి పెద్దిరెడ్డి
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లిలోని హాట్సన్ పాల డెయిరీలో నిన్న రాత్రి అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 20 మందికిపైగా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మందికిపైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.

పాలను కోల్డ్ స్టోరేజీలో ఉంచేందుకు అమ్మోనియం వాయువును ఉపయోగిస్తుంటారు. ఇది ప్రమాదవశాత్తు లీక్ కావడంతో ఈ ఘటన జరిగింది. అస్వస్థతకు గురైన కార్మికులను చిత్తూరు, గుడిపాల ఆసుపత్రులకు తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో 14 మంది మహిళా కార్మికులు ఉన్నారు. ఈ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ భరత్ గుప్తా డెయిరీని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Chittoor District
Hatsun dairy
ammonium gas
Andhra Pradesh

More Telugu News