sanchayita: డియర్‌ చంద్రబాబు గారు, మీ అబ్బాయికి నేనిచ్చిన సమాధానం చూడండి: సంచయిత కౌంటర్

sanchayita slams chandrababu
  • అసత్య ప్రచారం చేయడాన్ని మానుకోండి
  • మీ హయాంలో మాన్సాస్ ట్రస్టును దుర్వినియోగం చేశారు
  • అశోక్ గజపతిరాజు గారిని కాపాడడానికి వివాదాలు సృష్టిస్తున్నారు
  • ఓ మాజీ సీఎం ఇంతటి కింది స్థాయికి దిగజారుతారా?
విజయనగరం మాన్సాస్ ట్రస్టును అప్రదిష్ఠ పాలు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. 62 ఏళ్ల ఆ ట్రస్టు చరిత్రలో ఇంతటి దయనీయ పరిస్థితి ఎన్నడూ లేదంటూ ఆయన చేసిన విమర్శలపై మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి స్పందిస్తూ కౌంటర్‌ ఇచ్చారు.

'డియర్‌ చంద్రబాబు గారు అసత్య ప్రచారం చేయడాన్ని మానుకోండి. మీ అబ్బాయి నారా లోకేశ్‌కి నేను పంపిన సమాధానాన్ని ఒకసారి చదువుకోండి. మీ ఆధ్వర్యంలో మాన్సాస్ ట్రస్టును దుర్వినియోగం చేసిన  అశోక్ గజపతిరాజు గారిని కాపాడడానికి వివాదాలు సృష్టిస్తున్నారు.  ఓ మాజీ సీఎం ఇంతటి కింది స్థాయికి దిగజారుతారని ఎవరూ ఊహించలేరు' అని సంచయిత గజపతి విమర్శలు గుప్పించారు. గతంలో ఇదే విషయంపై నారా లోకేశ్‌ను ఉద్దేశిస్తూ తాను చేసిన ట్వీట్ల స్క్రీన్ షాట్లను ఆమె పోస్ట్ చేశారు.        
         
                   
sanchayita
Chandrababu
Telugudesam

More Telugu News