: ఏ ప్రధాని హయాంలోనూ ఇంతటి అవినీతి జరగలేదు:అరుణ్ జైట్లీ
ప్రధానిని గద్దె దించే వరకూ విశ్రమించమన్న అరుణ్ జైట్లీ ... మన్మొహన్ సింగ్ పై మరో సారి విరుచుకుపడ్డారు. అవినీతిని అంతమొందిస్తామన్న యూపీఏ మాటలు ఎవరూ నమ్మడం లేదన్నారు. యూపీఏ నాలుగేళ్ళ పాలనపై మీడియాతో మాట్లాడిన ఆయన, ఏ ప్రధాని హయంలోనూ ఇంత అవినీతి జరగలేదని విమర్శించారు. నిజాయతీపరుడని పేరు తెచ్చుకున్న ప్రధాని అసమర్థుడిగా ఉండి అవినీతికి సహకరించారని మండి పడ్డారు.