Shiva Parvathi: తన ఆరోగ్య పరిస్థితి, రూమర్లపై శివపార్వతి స్పందన!

Actress Shiva Parvathi clarifies about her health condition and rumours on video
  • ఆ వీడియో ఎవరు పంపించారో నాకు అర్థం కావడం లేదు
  • కరోనా నుంచి కోలుకుంటున్నా
  • నాకు ఆర్థిక సమస్యలు లేవు
తనకు కరోనా సోకిన తర్వాత తాను నటిస్తున్న సీరియల్ టీమ్ స్పందించలేదంటూ నటి శివపార్వతి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆమె మాట్లాడిన ఒక వీడియో వైరల్ అయింది. తాజాగా ఆమె మరో వీడియో విడుదల చేశారు. ఆ వీడియోను యూట్యూబ్ ఛానళ్లకు ఎవరు పంపించారో తనకు అర్థం కావడం లేదని చెప్పారు. ప్రస్తుతం తాను కరోనా నుంచి కోలుకుంటున్నానని తెలిపారు. తనకు అండగా నిలబడిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, పరుచూరి సోదరులు, తోటి నటీనటులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచమంతా కరోనాతో బాధపడుతోందని... బాధితుల్లో తాను కూడా ఒకరినని చెప్పారు. తనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని తెలిపారు. అందరి ఆశీర్వాదాలతో కరోనా నుంచి పూర్తిగా కోలుకుంటానని అన్నారు.
Shiva Parvathi
Tollywood
Corona Virus
Rumours

More Telugu News